తాడేపల్లి:
తాడేపల్లి పోలీస్ స్టేషన్ నందు ఘనంగా77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్సై ఖాజావలి.
ఈ సందర్భంగా ఎస్సై ఖాజావలి మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించి, ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన త్యాగధనుల సేవలను ప్రతి భారతీయుడు నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ ప్రజలకు నిస్వార్థంగా సేవలందించాల్సిన బాధ్యత ప్రతి
ఒక్కరిపై ఉందని తెలిపారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , గాంధీజీ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. ఈ కార్యక్రమంలో ఎస్సైలు సాయి, అపర్ణ లతో పాటు స్టేషన్ సిబ్బంది, విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు..




