మదనపల్లెలోని ప్రశాంత్ నగర్ లో ఆదివారం భర్త కృష్ణ ఇంటి ముందు భార్య రోజా రాణి ధర్నాకు దిగింది. భర్త తనను నిర్లక్ష్యం చేస్తూ కుటుంబ బాధ్యతలను తప్పించుకుంటున్నాడని.
పెళ్లి తర్వాత నుంచి ఆర్థికంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఆరోపించింది. కుటుంబ సభ్యులు, పెద్దలకు చెప్పినా న్యాయం జరగకపోవడంతో బహిరంగ నిరసనకు దిగాల్సి వచ్చిందని రోజా రాణి తెలిపింది. భర్త బయటకు వచ్చి గొడవకు దిగడంతో స్థానికులు గుమిగూడారు.






