Tuesday, January 27, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshయర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో 77వ గణతంత్ర వేడుకలు

యర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో 77వ గణతంత్ర వేడుకలు

యర్రగొండపాలెం టీడీపీ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
యర్రగొండపాలెం పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ, భారత రాజ్యాంగం గొప్పతనాన్ని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి, సమాజ శ్రేయస్సుకు మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని దేశభక్తి నినాదాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
జై హింద్!

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments