మదనపల్లెలో 77వ రిపబ్లిక్ వేడుకలను సోమవారం బీటీ కళాశాల మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అధికారులు సన్నద్ధమయ్యారు.
నూతన జిల్లా ఏర్పడ్డాక తొలిసారిగా జరుగుతున్న ఈ వేడుకలను 15 వేల మంది తిలకించేలా ఏర్పాట్లు చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థుల కోసం ప్రధాన వేదికకు ఇరువైపులా టెంట్లు, మూడు దిశలలో కుర్చీలు వేశారు. పోలీసులు ఇప్పటికే రిహార్సల్స్ పూర్తి చేశారు.




