అన్నమయ్య జిల్లా యంత్రాంగం ఆదివారం మదనపల్లెలో ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొని, ఓటు హక్కు వినియోగంపై ప్రజలను చైతన్యపరిచారు.
కలెక్టరేట్ నుంచి బిటి కళాశాల మైదానం వరకు జరిగిన ఈ ర్యాలీలో అధికారులు ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని, ఎన్నికల్లో తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు.




