కర్నూలు
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డోన్ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో మెప్మ (MEPMA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెప్మ బజార్‌ను గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబన
సాధించడమే మెప్మ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తమ ప్రతిభను ప్రదర్శించి, ఉపాధి అవకాశాలను విస్తరించుకునేందుకు మెప్మ బజార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
ప్రభుత్వం మహిళలు, పేద వర్గాల అభ్యున్నతికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే గారు సూచించారు. ఇలాంటి బజార్లు స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన వస్తువులు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, మెప్మ సిబ్బంది,
స్వయం సహాయక సంఘాల సభ్యులు, రిసోర్స్ పర్సన్స్, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పట్టణ ప్రజలు ప పాల్గొన్నారు. మెప్మ బజార్ ప్రారంభంతో మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం సందడి మరియు ఉత్సాహంతో నిండిపోయింది.




