బాపట్ల: 77వ గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. వాసుదేవ వినోద్ కుమార్ గారి అధ్యక్షతన బాపట్ల పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతావిష్కరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. వాసుదేవ వినోద్ కుమార్ గారు, సంయుక్త కలెక్టర్ భావనగారు , జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు గారు,బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గార్ల తో కలిసి పాల్గొన్నాను.
జిల్లాలో విధి నిర్వహణలో విశేష ప్రతిభ చూపిన పలువురు పోలీసు అధికారులకు రిపబ్లిక్ డే పురస్కారాలు లభించాయి.సోమవారం జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో వారికి ఎస్పీ ఉమామహేశ్వర్, కలెక్టర్ వినోద్ కుమార్ లు ప్రశంసా పత్రాలు అందజేశారు.అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు,చీరాల వన్ టౌన్, టూ టౌన్ సిఐలు
సుబ్బారావు,నాగభూషణం,ఇంకొల్లు ఎస్సై జి సురేష్,వన్ టౌన్ ఎస్ఐ హరిబాబు తదితరులకు ఈ పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు.
#Narendra




