రామసముద్రం మండల కేంద్రానికి చెందిన స్వతంత్ర సమరయోధుడు గంజి శ్రీనివాసరావు దేశానికి చేసిన సేవలకు గాను ఆయన కుమారులైన సీతారామయ్య, బాపూజీలను గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మదనపల్లిలోని బీటి కళాశాల పరేడ్ గ్రౌండ్లో ఘనంగా సత్కరించారు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిలి, కలెక్టర్ నిశాంత్ కుమార్ పూలమాలలు వేసి, శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.




