కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ధర్మవరం శివారున అక్రమంగా తయారీ చేస్తున్న కల్తీ వంట నూనె తయారీ కేంద్రంపై ప్రత్తిపాడు పోలీసులు దాడులు నిర్వహించారు.
ఎస్సై లక్మి కాంతం ఆధ్వర్యంలో నకిలీ ఆయిల్ తయారీ పాల్పడుతున్న నిందితుని అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుండి 15 నకిలీ ఆయిల్ డబ్బాలను,తయారీ ఉపయోగిస్తున్న 4 క్రూడ్ ఆయిల్ డబ్బాలు,తయారీకి ఉపయోగిస్తున్న పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో డిఎస్పి శ్రీహరి రాజు మాట్లాడుతూ అక్రమ ధనార్జన ధ్యేయంగా FK పాలెం గ్రామానికి చెందిన బండారు ఫణి ప్రసాద్, ధర్మవరం శివారున జంతువుల కొవ్వు,క్రూడ్ ఆయిల్ కలిపి మరగబెట్టి కల్తీ వంట నూనె తయారు చేసి,ఇచ్చాపురంకి చెందిన వెంకటేశ్వర ట్రేడర్స్,యజమాని సంతోషి శ్రీనివాస్ దాస్ ,రాజమండ్రికి చెందిన యం డి ఇఫ్రాన్ లతో ఒప్పందం కుదుర్చుకొని గత నాలుగు నెలలుగా ఆప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు.
నిందితుడితో పాటు మరో 8మంది ఈ అక్రమ దందాలో కొనసాగుతున్నారని వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.నిందితుడిని రిమాండ్ కు తరలిస్తామని అన్నారు..
ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు సూచనలతో అక్రమ కల్తీ వ్యాపార దందాను చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై లక్ష్మీకాంతం మరియు సిబ్బంది ని డిఎస్పి శ్రీహరి రాజు అభినందించారు.
ప్రజలు నకిలీ పదార్థాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.అక్రమ వ్యాపారాలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.. #Dadala babji






