నిమ్మనపల్లి మండలం దిన్నెమీదపల్లెలో భూవివాదం నేపథ్యంలో సోమవారం పాతకక్షలు భగ్గుమన్నాయి. చింతచెట్ల వ్యవహారంలో జి. నారాయణ (70), రవిబాబు (50) వర్గాల మధ్య కర్రలు, కొడవండ్లతో బీకరమైన ఘర్షణ
చోటుచేసుకుంది. ట్రాన్స్కో అధికారులు విద్యుత్ స్తంభాలు నాటేందుకు రావడంతో చింతచెట్లు నరికించాడని ఆరోపిస్తూ నారాయణ వర్గంపై దాడి జరిగినట్లు బాధితులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




