పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్లలో తప్పిపోయిన ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి పవన్ కుమార్ రెడ్డి ఆచూకీ సోమవారం తెలిసింది. కుటుంబీకుల కథనం ప్రకారం.
ఆదివారం తిరుపతిలో వెతుకుతుండగా గోవిందరాజుల గుడి వద్ద విద్యార్థి కనిపించాడు. తోటి విద్యార్థుల వద్ద అప్పు తీసుకుని, తీర్చలేక భయపడి వెళ్లిపోయినట్లు తెలిసింది. విద్యార్థి దొరకడంతో కుటుంబ సభ్యులు, పాఠశాల సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు# కొత్తూరు మురళి.






