Home South Zone Andhra Pradesh జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో సత్తా చాటిన పోలీస్ వారసులు

జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో సత్తా చాటిన పోలీస్ వారసులు

0

చీరాల: జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో సత్తా చాటిన చిన్నారులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు

జాతీయ స్థాయిలో రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ పట్టణంలోని ఎస్‌ఎమ్‌ఎస్ ఇండోర్ స్టేడియంలో జనవరి 18 నుండి 23వ తేదీ వరకు నిర్వహించిన ఇండియా తైక్వాండో థర్డ్ కిడ్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ 2025–2026 పోటీలలో బాపట్ల జిల్లాలో ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న 2013 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ మల్లెల విజయ్ బాబు కుమార్తె రంజయు లోచన్, కుమారుడు నిక్షిప్త విజయ్ మెడల్స్ సాధించారు.

మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈ చిన్నారులు తమ తండ్రి విజయ్ బాబుతో కలిసి జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు చిన్నారులను ఆత్మీయంగా అభినందించి, సాధించిన పతకాలను అందజేశారు.

మల్లెల విజయ్ బాబు కుమార్తె రంజయు లోచన్ (9 సం.), కుమారుడు నిక్షిప్త విజయ్ (7 సం.) లు గత సంవత్సరం డిసెంబర్ 27, 28 తేదీలలో గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెకండ్ ఏపీ స్టేట్ కిడ్స్ అండ్ ఫెడరేషన్ కప్–2025 లో ఇరువురు గోల్డ్ మెడల్స్ సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

జాతీయ స్థాయిలో జనవరి 18 నుండి 23వ తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ పట్టణంలోని ఎస్‌ఎమ్‌ఎస్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఇండియా తైక్వాండో థర్డ్ కిడ్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ 2025–2026 పోటీలలో ఇరువురు సత్తా చాటారు. రంజయు లోచన్ రజత పతకం, నిక్షిప్త విజయ్ కాంస్య పతకం సాధించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, పోలీస్ శాఖలో విధులు నిర్వహించే సిబ్బంది నిరంతరం విధి నిర్వహణలోనే ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుందని, కుటుంబానికి ప్రత్యేకంగా సమయం కేటాయించే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నారు. అయినప్పటికీ విధి నిర్వహణలో బిజీగా ఉన్నా తన పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించిన కానిస్టేబుల్ విజయ్ బాబును ప్రత్యేకంగా అభినందించారు.

పోలీస్ కుటుంబాల్లోని పిల్లలు చిన్న వయసులోనే క్రమశిక్షణతో కూడిన క్రీడల్లో రాణించడం ఎంతో ఆనందదాయకమన్నారు. తైక్వాండో వంటి ఆత్మరక్షణ క్రీడల్లో రంజయు లోచన్, నిక్షిప్త విజయ్ జాతీయ స్థాయిలో పతకాలు సాధించి జిల్లా పేరు, పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఈ చిన్నారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించి మంచి గుర్తింపు పొంది జిల్లాకు, జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ మల్లెల విజయ్ బాబు, చిన్నారులు రంజయు లోచన్, నిక్షిప్త విజయ్, చిన్నారులకు కోచ్ గా వ్యవహరించిన ఎం.సురేష్ తదితరులు పాల్గొన్నారు.

#Narendra

NO COMMENTS

Exit mobile version