మదనపల్లి టమోటా మార్కెట్ నుంచి బ్రహ్మంగారి గుడి వరకు నిర్మిస్తున్న డ్రైనేజ్ కాలువ పనులను వెంటనే నిలిపివేయాలని సీపీఐ నాయకులు మంగళవారం అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మకు ఫిర్యాదు చేశారు.
కదిరి రోడ్డులో మునిసిపల్ కౌన్సిల్ ఆమోదం లేకుండా రూ. 2. 70 కోట్లతో తాత్కాలిక డ్రైన్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 అడుగుల రోడ్డు వెడల్పు అనంతరమే శాశ్వత డ్రైన్లు నిర్మించాలని, లేనిపక్షంలో ఆందోళన చేస్తామని సీపీఐ నాయకులు హెచ్చరించారు.




