Thursday, January 29, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshనటి భూమిక పవన్ కల్యాణ్ రాజకీయంపై వ్యాఖ్యలు |

నటి భూమిక పవన్ కల్యాణ్ రాజకీయంపై వ్యాఖ్యలు |

Pawan Kalyan Bhumika Chawla Comments on His Political Journey

నటుడి నుంచి డిప్యూటీ సీఎం స్థాయికి ఎదగడం స్ఫూర్తిదాయకమని కితాబు
పవన్ కష్టపడి ఈ స్థాయికి చేరారని కొనియాడిన భూమిక
ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్ష
భూమిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్

పవన్ కల్యాణ్, భూమిక కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖుషి’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో, ఆయనపై నటి భూమిక చావ్లా హృదయపూర్వక ప్రశంసలు కురిపించారు. ఒకప్పటి తన సహనటుడు రాజకీయాల్లో ఉన్నత శిఖరాలకు చేరడంపై ఆమె తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ప్రస్తుతం భూమిక తన కొత్త చిత్రం ‘యుఫోరియా’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “‘ఖుషి’ సినిమాలో పవన్ కల్యాణ్‌తో కలిసి పనిచేసిన రోజులు ఇంకా గుర్తున్నాయి. ఒక నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి, ప్రజాసేవ వైపు అడుగులు వేసి, ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆయన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఆయన పడిన కష్టానికి, నిబద్ధతకు ఈ విజయం ఒక నిదర్శనం. ఆయన సాధించిన ఈ స్థాయి ఎంతో మంది యువతకు ఆదర్శం” అని కొనియాడారు.

కేవలం ప్రశంసలతోనే ఆగకుండా, పవన్ కల్యాణ్‌కు తన శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. “పవన్ కల్యాణ్‌కు భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ప్రజలకు మరింత గొప్ప సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాను” అని భూమిక పేర్కొన్నారు. ఒక నటుడిగా అసాధారణమైన స్టార్‌డమ్ చూసి, ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి, అనేక సవాళ్లను ఎదుర్కొని ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం నిజంగా అభినందనీయమని ఆమె అన్నారు. భూమిక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments