Thursday, January 29, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమత్తు పదార్థాల నిర్మూలన అందరి బాధ్యత గద్దె రామ్మోహన్

మత్తు పదార్థాల నిర్మూలన అందరి బాధ్యత గద్దె రామ్మోహన్

మత్తు పదార్థాల నిర్మూలన అందరి బాధ్యత
డ్రగ్స్ పై దండయాత్ర ర్యాలీలో గద్దె రామమోహన్

డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల సమూల నిర్మూలన అందరి బాధ్యత అని, సమాజంలోని అందరూ అందుకు నడుం కట్టాలని తూర్పు శాసనసభ్యులు గద్దె రామమోహన్ పిలుపునిచ్చారు.
బుధవారం నాడు రామలింగేశ్వరనగర్ స్క్య-బ్రిడ్జి వద్ద, కృష్ణలంక పోలీసు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ పై దండయాత్ర సైకిల్ ర్యాలీలో శాసనసభ్యులు గద్దె రామ మోహన్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు గద్దె రామమోహన్ మాట్లాడుతూ సమాజంలో మత్తు పదార్థాల నియంత్రణ అనేది కేవలం పోలీసులే కాకుండా సమాజంలోని అన్ని వర్గాల వారూ బాధ్యతగా భావించి వాటి నిర్మూలనకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. గత ఐదు సంవత్సరాలలో గంజాయిని పాఠశాలల స్థాయికి తీసుకొచ్చి, చిన్న పిల్లలను కూడా పాడుచేసిన ఘనత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిదేనని విచారం వ్యక్తం చేశారు. ‘డ్రగ్స్ పై దండయాత్ర’ అంటూ పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమం సమాజానికి చాలా ఉపయోగకరమని కొనియాడారు. అన్ని వర్గాల వారూ

తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. తూర్పు నియోజకవర్గంలో మొదటిగా మహితా పబ్లిక్ స్కూలు వద్ద ఈ కార్యక్రమము మొదలు పెడుతున్నామని చెప్పారు. మంగళవారంనాడు రాష్ట్రవ్యాప్త కార్యక్రమము మొదలయిందని, కొందరు పోలీసులు ఎన్.టి.ఆర్.జిల్లాలో సైకిల్ పై పర్యటించి డ్రగ్సును అరికట్టడానికి ప్రజలలో అవగాహన కల్పిస్తారని తెలిపారు. నగర పోలీసువారికి పెట్రోలింగ్ కోసం రూ.7లక్షలు విలువైన వాహనాలను, లా అండ్ ఆర్డర్ కాపాడడానికి సీసీ

కెమెరాలు కోసం మరో రూ. 6 లక్షలు ఆర్థిక సహాయాన్ని గద్దె ఫౌండేషన్ నుంచి ఇవ్వడం జరిగిందని గద్దె రామమోహన్ తెలిపారు. పాఠశాలల వద్ద గంజాయి కలిపిన చాక్లెట్లు అమ్ముతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, వెంటనే పోలీసులకు తెలియజేశానని చెప్పారు. ప్రతి టీచరూ, ప్రతి తల్లీ-తండ్రీ, పొరుగువారు, స్నేహితులు అందరూ అప్రమత్తంగా ఉండి తమ చుట్టుప్రక్కల వారు ఎవరైనా డ్రగ్స్, గంజాయిలాంటి వాటిని సేవిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. పోలీసులు ఎవరినీ అరెస్టు చేయరని, మత్తు పదార్థాలకు అలవాటయినవారికి చక్కటి కౌన్సెలింగ్ ఇప్పించి ఇంటికి పంపుతారని వివరించారు. ఎన్టీఆర్ పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు నూతన సాంకేతికతను ఉపయోగించి గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు గొప్ప కార్యక్రమాలను చేపడుతున్నారని కొనియాడారు.

*జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ* గత ప్రభుత్వంలోని పెద్దలు గంజాయిని ప్రోత్సహించారని, వాటిని సేవించి అనేక కుటుంబాలు నాశనమయ్యాని, చాలా మంది అనేక బాధలు పడ్డారని చెప్పారు. కూటమి ప్రభుత్వం గంజాయి సాగుని, డ్రగ్స్ విక్రయాలను గట్టిగా అరికడుతోందని చెప్పారు. టీచర్లు, తల్లిదండ్రులు, సమాజంలోని పెద్దలు గంజాయి, డ్రగ్స్ గురించి తమకు తెలిసిన సమాచారాన్ని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పోలీసులు చేపడుతున్న డ్రగ్స్ పై దండయాత్ర మంచి కార్యక్రమమని కొనియాడారు.
*ఎన్టీఆర్ జిల్లా పోలీసు డిప్యూటీ కమిషనర్ కృష్ణకాంత్ పటేల్ మాట్లాడుతూ* ప్రజలు తమ పరిధిలో ఎక్కడైనా సరే డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల గురించిన సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని కోరారు. వాటిని తప్పకుండా అరికడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డి.సి.పి, మురళీకృష్ణ, సౌత్ ఎ.సి.పి. ప్రవీణ్ కుమార్, కృష్ణలంక సి.ఐ. నాగరాజు లతో పాటు కూటమి పార్టీ నాయకులు ముమ్మనేని ప్రసాద్, సింగంశెట్టి రమేష్, ఉమ్మడిశెట్టి బహుదూర్, రాయి రంగమ్మ, గోగుల ఏసు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments