మదనపల్లి మండలంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా పడి డ్రైవర్ షఫీ ఉల్లా (53)కు తీవ్ర గాయాలయ్యాయి.
పుంగనూరు నుంచి సీటీఎం వైపు వెళ్తుండగా తట్టివారిపల్లి సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించగా, వైద్యుల చికిత్సతో ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు.




