లేబర్స్ కొడ్స్ రద్దు చేయాలని నిరసన
కేంద్ర మంత్రి, లేబర్ అధికారులకు వినతి
విజయవాడ: కేంద్ర ప్రభుత్వం అమలుపూనుకున్న లేబర్ కొడ్స్ రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాల మెరుపు నిరసన చేశారు. బుధవారం కేంద్ర లేబర్ మంత్రి, లేబర్ అధికారులు నగరంలోని రింగ్ రోడ్డులోని ఒక హోటల్ లో సమావేశమైయ్యారని సమాచారం అందింది. ఈ మేరకు కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్తంగా హోటల్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. లేబర్ కొడ్స్ రద్దు చేయాలని, వాటిని వెనక్కి తీసుకోవాలని పెద్ద పెట్టున నినదించారు. కొద్దిసేపు పోలీసులకు, కార్మిక సంఘాల నాయకుల మధ్య తోపులాట జరిగింది.
అధికారులను కలవటానికి నాయకులు పట్టుపట్టటంతో చివరికి పోలీసు అధికారులు అంగీకరించటంతో చర్చలు సఫలమైనాయి. వినతిపత్రం కూడా సమర్పించినారు. ఈ సందర్భంగా విలేకరులతో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ కార్మికులు సాధించుకున్న హక్కులను, చట్టాలను తుంగలో తొక్కి 4 లేబర్స్ కొడ్స్ అమలు చేయటం సమజం కాదని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరావు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి, 12 గంటలు అమలు చేస్తూ, జిఓ తేవటాన్ని తప్పుపట్టారు. లేబర్ కోడ్ లను, రైతులకు నష్టం కలిగించే విత్తన చట్టాన్ని,
నష్ట దాయకమైన ఉపాధి హామీ చట్ట సవరణలను, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాకన్నారు. కేంద్రం తెచ్చిన నష్ట దాయక విధానాలకు రాష్ట్ర0 లోని tdp, జనసేన, వైసీపీ లు మద్దతు తెలుపు తున్నాయన్నారు.
కార్పొరేట్ లకు సేవ చేసే, కార్మికుల జీవితాలపై మట్టికొడుతున్నారని మండిపడ్డారు. ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షులు కె. పోలారి మాట్లాడుతూ బిట్రిష్ కాలంలోనే సాధించుకున్న హక్కులను, చట్టాలను నేటి బిజెపి ప్రభుత్వం కాలరాయటం దుర్మార్గమన్నారు. ఏఐయుటియుసి రాష్ట్ర అధ్యక్షులు సుధీర్ మాట్లాడుతూ బిజెపికి వత్తాసు పలికే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వాలు వలె మట్టికొట్టుకు పోవటం ఖాయమని విమర్శించారు. ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.
రామకృష్ణ మాట్లాడుతూ ఏటువంటి భధ్రత లేకుండా కార్మికులకు వెట్టిచాకిరీ మిగిల్చారని, కార్పొరేట్ లకు బిజెపి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా తమ విధానాలు బహిర్గతమైనాయని కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ నిరసన కార్యక్రమంలో టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు మరీదు ప్రసాద్ బాబు, citu రాష్ట్ర కార్యదర్శి RV నర్సింహ రావు, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు ఆంజనేయులు, కార్యదర్శి సాంబశివరావు, సి ఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ సిహెచ్ శ్రీనివాస్, అధ్యక్షులు ఎ. వెంకటేశ్వరరావు, ఇఫ్టూ నాయకులు పద్మా, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.




