Wednesday, January 28, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమంగళగిరిలో గాయత్రి బ్యాంక్ ప్రారంభోత్సవం చిల్లపల్లి శ్రీనివాసరావు

మంగళగిరిలో గాయత్రి బ్యాంక్ ప్రారంభోత్సవం చిల్లపల్లి శ్రీనివాసరావు

మంగళగిరిలో గాయత్రి బ్యాంక్ బ్రాంచ్ శుభారంభం

-తెలుగురాష్ట్రాల్లో విస్తరిస్తున్న గాయత్రి బ్యాంక్ సేవలు

-మంగళగిరి బ్రాంచ్ ను ప్రారంభించిన టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకిదేవి

-ప్రత్యేక ఆహ్వానితులుగా డి.ఎల్.కాంతారావు, నందం అబద్ధయ్య, చిల్లపల్లి శ్రీనివాసరావు, షేక్ హసన్ బాషా, సంకా బాలాజీగుప్తా, షేక్ అక్రమ్

హాజరైన వివిధ రంగాల ప్రముఖులు

మంగళగిరి నగరంలోని రాజీవ్ సెంటర్లో ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ శాఖను బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డి.ఎల్.కాంతారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా, మంగళగిరి

ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సంకా బాలాజీగుప్తా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్స్ బోర్డు మెంబర్ షేక్ అక్రమ్, అమరావతి ఉమెన్స్ కోఆపరేటివ్ సొసైటీ సీఈవో శ్రీనివాస్, వీటీజేఎం, ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ దామర్ల వెంకట నరసింహం, బ్యాంక్ పాలకవర్గసభ్యులు. పురప్రముఖులు, సహకార అధికారులు పాల్గొని బ్యాంక్ లోని వివిధ విభాగాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ రంగాల ప్రముఖులు జొన్నాదుల బాబూశివప్రసాద్ (బాబ్జీ), ప్రెగడ అజయ్, అనిల్ చక్రవర్తి ఇసునూరు, గాజుల శ్రీనివాసరావు, అందె మురళీమోహన్, నందం

బ్రహ్మేశ్వరరావు, ఉడతా శ్రీనివాసరావు (బీరువాల శ్రీను), కౌతరపు వేణుగోపాల్ తదితర ప్రముఖలు, వ్యాపారులు పాల్గొని బ్యాంక్ యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ది గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రీజనల్ హెడ్ కోటా శ్రీనివాసులు, మంగళగిరి బ్రాంచ్ హెడ్ ఎం.సంతోష్ కుమార్, విజయవాడ రీజనల్ బిజినెస్ మేనేజర్లు ప్రశాంత్ గైక్వాడ్, పి.సాయి ఆనంద్, విజయవాడ మేనేజర్ల ప్రదీప్, ఫణి, మంగళగిరి బ్రాంచి సిబ్బంది ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు.

*గాయత్రి బ్యాంక్ పారదర్శక సేవలు: తమ్మిశెట్టి*

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి మాట్లాడుతూ, గాయత్రి బ్యాంకు వినియోగదారులకు పారదర్శక సత్వర సేవలందించాలనే ఉద్దేశంతో కృషి చేస్తూ నేడు మల్టీ స్టేట్ బ్యాంకుగా రూ.3978.75 కోట్ల వ్యాపారాన్ని చేపట్టి 8,90,721 మంది వినియోగదారులతో తెలంగాణలోని కో ఆపరేటివ్ బ్యాంకుల్లో మొదటి స్థానానికి చేరుకుందన్నారు.

*బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలి : అబద్ధయ్య*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య మాట్లాడుతూ, మంగళగిరి ప్రాంత ప్రజలు గాయత్రి కోఆపరేటివ్ బ్యాంకు సేవలను వినియోగించుకోవాలని కోరారు. గాయత్రి బ్యాంక్ మంగళగిరిలో బ్రాంచి ఏర్పాటు చేయడం ద్వారా మంచి అభివృద్ధిని సాధించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

*గాయత్రి బ్యాంక్ వినూత్న సేవలు: చిల్లపల్లి శ్రీనివాస్*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, బ్యాంకులో మొబైల్ బ్యాంకింగ్, ఏఈపీఎస్, యూపీఐ, ఏటీఎం సర్వీసులు, ఆర్ టీజీఎస్ వంటి టెక్నాలజికల్ సేవలతోపాటు, నిరక్షరాస్యులకు సహాయకంగా ఉండేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారని అన్నారు. గాయత్రి బ్యాంక్ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7గంటల వరకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండడం, ఖాతాదారులకు అవసరమైన ఫొటో జిరాక్సులను బ్యాంకుయందే ఉచితంగా అందించడం వంటి పలు సేవలు వినూత్నంగా ఉన్నాయని, వినియోగదారులు తప్పక ఆదరిస్తారనే నమ్మకం తనకు వుందని చిల్లపల్లి పేర్కొన్నారు.

*మనం దాచుకునే డబ్బుకు రక్షణ: హసన్ బాషా*

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా మాట్లాడుతూ, మంగళగిరిలో ది గాయత్రీ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 73వ బ్రాంచ్ ప్రారంభోత్సవం చేయడం జరిగిందన్నారు. బ్యాంక్ అనేది ఒక పవిత్రమైనదని, కష్టపడి మనం దాచుకునే డబ్బుకు రక్షణ కల్పిస్తుందన్నారు. మంగళగిరి ప్రజలు ఈ విషయాన్ని అర్థంచేసుకుని బ్యాంకుకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.

*సత్వరంగా బ్యాంకింగ్ సేవలు: బాలాజీగుప్తా*

ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ సంకా బాలాజీగుప్తా మాట్లాడుతూ, గాయత్రీ నిర్భయ సేవింగ్ ఖాతా ద్వారా రూ.2 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని అందిస్తోందని, వర్తక, వ్యాపార, ఉద్యోగులకు కావలసిన అన్నిరకాల బ్యాంకింగ్ సేవలను సత్వరంగా అందిస్తుందని తెలిపారు. గాయత్రి అర్బన్ బ్యాంక్ సేవలను మంగళగిరి వాసులు వినియోగించుకుని బ్యాంకును ఆదరించాలని కోరారు.

*సత్వరసేవలకు మారుపేరు గాయత్రి బ్యాంక్: అక్రమ్*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్స్ బోర్డు మెంబర్ షేక్ అక్రమ్ మాట్లాడుతూ, కేవలం రూ.600 రూపాయలకే సేవింగ్ ఖాతాను ప్రారంభిస్తారని, రైతులు, మహిళలు అందరూ కూడా సేవింగ్ ఖాతాలను ప్రారంభించి, ఆర్థిక లావాదేవీలను యూపీఐ (ఫోన్ పే, గూగుల్ పే) ద్వారా నిర్వహించడం సులువుగా ఉంటుందన్నారు. బ్యాంకు యందు ఎటువంటి హిడెన్ చార్జీలు లేకుండా పేద, మధ్య తరగతి వినియోగదారుల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారని, అన్ని రకాల రుణాలను అందిస్తున్నారని, సత్వర సేవలకు మారుపేరుగా ఉందన్నారు.

*మంగళగిరి ప్రజలు ఆదరించాలి: బ్యాంక్ రీజనల్ హెడ్ శ్రీనివాసులు*

బ్యాంకు రీజినల్ హెడ్ కోటా శ్రీనివాసులు మాట్లాడుతూ, వినియోగదారులకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉంటాయని, కరెంట్ ఖాతా కేవలం రూ.1000/- బ్యాలెన్స్ తో వెంటనే ప్రారంభిస్తామని, మంగళగిరి ప్రజలు తమ బ్యాంకు సేవలను వినియోగించుకుని ఆదరించాలని కోరారు. గాయత్రి బ్యాంక్ 2000 సంవత్సరంలో జగిత్యాలలో ప్రారంభమైందని, అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు మంగళగిరిలో 73వ బ్రాంచిగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా వుందన్నారు. మార్చి 2026నాటికి 100 బ్రాంచ్ ల మార్కుకు చేరుకోవాలనే సంకల్పంతో ముందుకువెళుతోందని తెలిపారు.

*ఎటువంటి ప్రాసెసింగ్ చార్జీలు లేవు : బ్రాంచ్ హెడ్ సంతోష్*

బ్రాంచి హెడ్ ఎం. సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ఆధార్ నంబర్ ద్వారా నగదు బదిలీ పథకం కింద వచ్చు సబ్సిడీ బదలాయింపులను, బంగారు ఆభరణాలపై రుణాలను అందజేస్తామని, రైతులకు, వ్యాపారులకు ఆస్తి తనఖాపై ఋణసౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అలాగే, సేవింగ్, కరెంట్ ఖాతాలను వెంటనే ప్రారంభిస్తామని, వినియోగదారులు బ్యాంకును ఆదరించి ప్రోత్సహించాలని కోరారు. రుణాలపై ఎటువంటి ప్రాసెసింగ్ చార్జీలు లేవని, డిపాజిట్లపై ఆకర్షణీయ వడ్డీరేట్లను అందిస్తున్నామని తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments