మదనపల్లె పట్టణంలో మంగళవారం రాత్రి గొలుసు దొంగలు రెచ్చిపోయారు. కలెక్టరేట్ సమీపంలోని మోర్ సూపర్ మార్కెట్ వద్ద రిటైర్డ్ టీచర్ ఎం. ఎన్. జయలక్ష్మి రోడ్డుపై నిలబడి ఉండగా
హెల్మెట్ ధరించిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆమె మెడలో ఉన్న సుమారు 22 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. బాధితురాలి కేకలతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై 1 టౌన్ సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




