శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రాత్రి వేళల్లో కట్టుదిట్టమైన నైట్ బీట్ చెకింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతల పరిరక్షణతో పాటు జిల్లాలో శాంతి భద్రతలు కట్టుదిట్టంగా కొనసాగించేందుకు ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది రాత్రి వేళల్లో విస్తృతంగా నైట్ బీట్ చెకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ నైట్ బీట్ చెకింగ్ సమయంలో పట్టణాలు, గ్రామాలు, హైవే రోడ్లు, ప్రధాన కూడళ్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాలు, లాడ్జీలు, ధాబాలు, బహిరంగ ప్రదేశాలు మొదలైన చోట్ల ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను ప్రశ్నించి, వారి వివరాలను పరిశీలించారు.
అక్రమ కార్యకలాపాలు, చోరీలు, దొంగతనాలు, బహిరంగ మద్యం సేవనం, గంజాయి వినియోగం, జూదం, అసాంఘిక చర్యలను అరికట్టేందుకు ఈ తనిఖీలు ఎంతో ఉపయోగకరంగా నిలిచాయి. నైట్ బీట్ నిర్వహణలో భాగంగా వాహనాలను కూడా తనిఖీ చేసి, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలను గమనించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 100 / 112 కు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే నేర రహిత సమాజాన్ని నిర్మించగలమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి నైట్ బీట్ చెకింగ్ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు




