హత్య కేసులోనే ముద్దాయిను అరెస్టు చేసిన మార్కాపురం జిల్లా పోలీసులు
ముద్దాయిలు: 1.అడపాల ఝాన్సీ భర్త లాల శ్రీను, 31 సంవత్సరాలు, మెట్టబజార్ ,అయ్యప్ప స్వామి గుడి దగ్గర, దోర్నాల గ్రామం & మండలం, మార్కాపురం జిల్లా.
2. సానే అశోక్ కుమార్ తండ్రి తిరుమల కొండ, 28 సంవత్సరాలు, మెట్ట బజార్ అయ్యప్ప స్వామి గుడి దగ్గర, దోర్నాల గ్రామం & మండలం, మార్కాపురం జిల్లా
*మృతుడు*: అడపాల లాల శ్రీను తండ్రి కొండయ్య, 38 సంవత్సరాలు, మెట్ట బజార్ అయ్యప్ప స్వామి గుడి దగ్గర, దోర్నాల గ్రామం & మండలం, మార్కాపురం జిల్లా.
*వివరాలు*: పెద్దరావీడు PS క్రైమ్ నెంబర్ 06/2026 U/s 103 (1), r/w 3(5) BNS కేసులో మృతుడైన అడపాల లాల శ్రీను మరియు ఈ కేసులోని ముద్దాయి అడపాల ఝాన్సీలు భార్యాభర్తలు వీళ్లు దోర్నాల గ్రామంలో శ్రీశైలం వెళ్లే రూట్లో అయ్యప్ప స్వామి గుడి దగ్గర గత 4 సంవత్సరాల నుండి టీ మరియు కూల్ డ్రింక్ షాపు నిర్వహిస్తూ ఉన్నారు. మృతుడు లాలా శ్రీను చెడు వ్యసనాలకు బానిసై పేకాట ఆడటం, ఇతరుల చేత ఆడించటం చేస్తూ
ఉండేవాడు,అతను ఆర్థికంగా బలహీనపడటం తన భార్య ఝాన్సీ మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని ఉన్నదని అనుమానంతో దానికి ఆమె తమ్ముడు సానే అశోక్ కుమార్ సహకరిస్తున్నాడనే విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నవి. అయితే గత నవంబర్ నెలలో మృతుడు అడపాల లాల శ్రీను గంజాయి అమ్ముతుండగా దోర్నాల పోలీసు వారు పట్టుకొని అరెస్టు చేయడం జరిగింది. ఆ కేసులో మృతుడు రిమాండ్ ఖైదీగా ఒంగోలు జైల్లో
ఉంటుండగా అతని భార్య ఝాన్సీ అక్రమ సంబంధానికి అడ్డు లేకుండా పోయింది, అయితే మృతుడు జైల్లో నుండి అతని భార్య ఝాన్సీతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నావు, నేను లేకపోతే అడ్డు ఆపు లేకుండా ఉంది, అందుకే నువ్వు నన్ను బెయిల్ మీద బయటకు తీసుకొని రావటం లేదని, నువ్వు బెయిల్ పెట్టకపోయిన నేను ప్రభుత్వం వారు ఇచ్చే ఫ్రీ బెయిల్ మీద అయినా బయటకు వచ్చి నిన్ను నీ తమ్ముడుని అంతు చూస్తానని అని మాట్లాడటం జరిగేది. ఈ విధంగా మృతుడు అతని భార్య ఝాన్సీ మరియు ఆమె తమ్ముడు అశోక్ కుమార్ లను బెదిరిస్తూ ఉండటంతో తన అక్రమ సంబంధానికి అడ్డువస్తాడని తనకు అతని వల్ల ప్రాణహాని ఉన్నదని ఎలాగైనా తన భర్తని చంపేయాలని తన తమ్ముడు అశోక్ కుమార్ ఆమె కలిసి మరికొంతమందితో పథకం రచించి మృతుడికి బెయిలు పెట్టించి తేదీ
21.01.2026 న బెయిల్ మీద ఒంగోలు జైలు నుండి తీసుకుని వస్తూ వారు ముందుగా పన్నిన పథకం ప్రకారం పెద్దారవీడు దాటి నా తరువాత బద్వీడు చెర్లోపల్లి గ్రామానికి మధ్య అంకాలమ్మ దేవస్థానం సమీపానికి వచ్చేసరికి మూత్ర విసర్జనకని వారు ప్రయాణిస్తున్న కారును ఆపి అందులో నుండి మృతుడు క్రిందకు దిగగా పథకం ప్రకారం అతని కళ్ళల్లో కారంకోట్టి వారితోపాటు తెచ్చుకున్న కత్తులతో విచక్షణారహితంగా గాయపరిచి మృతుడు పడిపోగా అతని తలపై బండరాయితో కొట్టి చంపి వేసి, అతని భార్య ఝాన్సీ మరియు బావమరిది అశోక్ కుమార్ లు మిగిలిన ముద్దాయిలను అక్కడ నుంచి పంపివేసి తన భర్త యొక్క హింసలు భరించలేక తను తన తమ్ముడు కలిసి తన భర్తను చంపివేసినట్లు పోలీస్ డైల్ 112 కు ఫోన్ చేసి చెప్పడం జరిగింది.
నేరము జరిగిన వెంటనే మార్కాపురం జిల్లా ఇంచార్జి ఎస్పీ శ్రీ వి. హర్షవర్దన్ రాజు ఐపీయస్ గారు ఈ కేసును దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు డి ఎస్పీ
U. నాగరాజు గారి సూచనలను పాటిస్తూ త్రిపురాంతకం CI G. అస్సాన్ కేసును దర్యాప్తు చేపట్టి, ఈ కేసు దర్యాప్తులో మృతుని భార్య అడపాల ఝాన్సీ మరియు ఆమె తమ్ముడు సానే అశోక్ కుమార్ మరికొంతమందితో కలిసి లాల శ్రీను ను హత్యా చేసినట్టు నేరం రుజువు కావడంతో, నిన్న అనగా ది 22.01.2026 వ తేదిన రాత్రి 8 గంటల సమయంలో మృతుని భార్య అడపాల ఝాన్సీ మరియు ఆమె తమ్ముడు సానే అశోక్ కుమార్ లను ముద్దాయిలను అరెస్ట్ చేయడమైనది. ఈ రోజు రిమాండ్ నిమిత్తం మార్కాపురం AJFCM కోర్ట్ నందు హాజరుపరచగలము. మిగిలిన ముద్దాయిలను కూడా తొందరలో అరెస్ట్ చేసి కేసు దర్యాప్తును త్వరితగతిన ముగించిగలము. ఈ కేసును చేధించిన త్రిపురాంతకం C.I G. అస్సాన్, పెద్దారవీడు SI వి. సాంబ శివయ్య మరియు వారికీ దర్యాప్తులో సహకరించిన సిబ్బందిని మార్కాపురం డిఎస్పీ గారు అభినందించినారు.






