AP Budget Sessions Dates Fixed Finance Minister to Present Budget
ఫిబ్రవరి 11 నుంచి మార్చి 12 వరకు ఏపీ బడ్జెట్ సమావేశాలు
11న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై 13న ప్రసంగించనున్న సీఎం చంద్రబాబు
ఏపీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 11 నుంచి మార్చి 12 వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా జరగనున్నాయి. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 14న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను సమర్పించనున్నారు.
సమావేశాల తొలి రోజైన ఫిబ్రవరి 11న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమవుతుంది. అదే రోజు స్పీకర్ అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో బీఏసీ సమావేశం జరుగుతుంది. ఫిబ్రవరి 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ తీర్మానంపై ప్రసంగించనున్నారు.
ఈసారి సమావేశాల్లో కేవలం బడ్జెట్‌కే పరిమితం కాకుండా పలు కీలక బిల్లులను కూడా ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా అన్ని శాఖల ఉన్నతాధికారులను ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు సమాచారం.





