Home South Zone Andhra Pradesh ఆర్టీసీ బస్టాండ్‌లో శక్తి యాప్‌పై మహిళల భద్రత అవగాహన కార్యక్రమం |

ఆర్టీసీ బస్టాండ్‌లో శక్తి యాప్‌పై మహిళల భద్రత అవగాహన కార్యక్రమం |

0
0

మహిళల భద్రతకు శక్తివంతమైన ఆయుధం – శక్తి యాప్ : ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రకాశం జిల్లా పోలీసుల అవగాహన కార్యక్రమం
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు మహిళల భద్రత, రక్షణను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు శక్తి యాప్ (Shakthi App) పై అవగాహన కార్యక్రమాన్ని ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ – టీమ్–1 మరియు టీమ్–2 సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా బస్టాండ్‌కు వచ్చే మహిళలు, యువతులు, ప్రయాణికులకు శక్తి యాప్ ఉపయోగాలు వివరించి, వారి మొబైల్ ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు.

పోలీసులు మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో ఒక్క బటన్ నొక్కితే వెంటనే పోలీస్ సహాయం అందే విధంగా శక్తి యాప్ రూపొందించబడిందని తెలిపారు. ఈ యాప్ ద్వారా మహిళల లైవ్ లొకేషన్, ఆడియో రికార్డింగ్, అత్యవసర అలర్ట్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు చేరుతాయని వివరించారు.
ప్రత్యేకంగా పని నిమిత్తం ప్రయాణించే మహిళలు, విద్యార్థినులు శక్తి యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించాలని సూచించారు.

మహిళలపై జరుగుతున్న వేధింపులు, ఈవ్ టీజింగ్, సైబర్ నేరాల నివారణలో శక్తి యాప్ ఎంతో కీలకమని తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమానికి ప్రయాణికులు సానుకూల స్పందన తెలియజేస్తూ, శక్తి యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. మహిళల భద్రత కోసం ఇలాంటి కార్యక్రమాలను జిల్లావ్యాప్తంగా కొనసాగిస్తామని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.

NO COMMENTS