ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్
రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గానికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్
1,03,534 కుటుంబాలకు లబ్ధి
మగ్గం వాడే నేతన్నలకు నెలకు రూ.720లు, ఏడాదికి రూ.8,640లు ఆదా
మరమగ్గం చేనేతలకు నెలకు రూ.1800లు, ఏడాదికి రూ.8,640ల లబ్ధి
ప్రభుత్వంపై ఏడాదికి రూ.85 కోట్లకు పైగా భారం
నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పనే కూటమి లక్ష్యం/
కల్తీకి కేరాఫ్ అడ్రాస్ జగన్*
తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని తేల్చిన సుప్రీంకోర్టు సిట్
పామాయిల్, ఇతర కెమికల్స్ వాడినట్లు తేల్చిన సిట్
చేసిన తప్పు కప్పిపుచ్చుకోడానికి జగన్ బ్యాచ్ బుకాయింపు : మంత్రి సవిత మండిపాటు
అమరావతి : నేతన్నలకు ఎన్నికల్లో ఇచ్చిన మరో కీలక హామీని నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లను ఉచితంగా అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం అమలులో భాగంగా ఏడాదికి రూ.85 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై భారం పడనున్నట్లు తెలిపారు. తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని సుప్రీం కోర్టు సిట్ తేల్చిందని, ఆ తప్పులను
కప్పిపుచ్చుకోడానికి జగన్ బ్యాక్ బుకాయిస్తోందని మండిపడ్డారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆనాడు అన్న ఎన్టీఆర్, నేడు సీఎం చంద్రబాబునాయుడు నేతలన్నలకు అండగా ఉంటున్నారన్నారు. 2014-19 టీడీపీ పాలన నేతన్నలకు స్వర్ణయుగమన్నారు. గత ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చుతోందన్నారు. దీనిలో భాగంగా నేతన్నలకు ఇచ్చిన కీలక హామీ ఉచిత విద్యుత్ పథకం అమలుకు
కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ పథకం అమలు చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. మగ్గం కలిగిన నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గం ఉన్న చేనేతలకు 500 యూనిట్లు ఉచితంగా అందజేయనున్నామన్నారు. మగ్గం కలిగిన 93 వేల కుటుంబాలు, మర మగ్గాలు వాడుతున్న 10,534 కుటుంబాలు మొత్తం 1,03,534 కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకంతో లబ్ది కలుగనుందన్నారు. ఈ పథకం అమలుతో ప్రభుత్వంపై ఏడాదికి రూ.85 కోట్లకుపైగా భారం పడనున్నట్లు వెల్లడించారు. మగ్గం వాడే నేతన్నకు నెలకు రూ.720లు, ఏడాదికి రూ.8,640లు ఆదా కానున్నట్లు తెలిపారు. మర మగ్గం లబ్దిదారులకు నెలకు రూ.1800లు, ఏడాదికి రూ.21,600లు ఆర్థికంగా లబ్ధికలుగుతున్నట్లు వెల్లడించారు.
*నేతన్నలకు ఆర్థిక భరోసా*
రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని, ఆర్థిక భరోసా కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని మంత్రి సవిత తెలిపారు. ఇందులో భాగంగా అధికారంలోకి రాగానే 50 ఏళ్ల నిండిన నేతన్నలకు నాలువేల రూపాయల పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. ఇలా రాష్ట్రంలో 87,280 మందికి నేతన్నలకు పెన్షన్లు
అందజేస్తున్నామన్నారు. రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెన్షన్లు పెంచడం వల్ల నేతన్నకు నెలకు రూ.1000 చొప్పున్న ఏడాదికి రూ.12 వేల మేర ఆర్థిక లబ్ధి కలుగుతోందన్నారు. గడిచిన రెండు నెలల్లో ఆప్కో ద్వారా చేనేత సహకార సంఘాలకు రూ.7 కోట్ల మేర బకాయిలు చెల్లించామన్నారు. ఈ ఏడాది మొదటి విడత త్రిఫ్ట్ ఫండ్ నిధుల్లో భాగంగా రూ.1.67 కోట్లు మంజూరు చేశామన్నారు. ఎన్ హెచ్డీసీ ద్వారా నూలుపై 15 శాతం రాయితీ అందజేస్తున్నామన్నారు. నేతన్నలకు ఇచ్చే ప్రాసెసింగ్ ఛార్జీలు పెంచామని మంత్రి సవిత వెల్లడించారు.
*నేతన్నలకు గౌరవప్రదమైన జీవనమే లక్ష్యం*
నేతన్నలకు 365 రోజుల పాటు ఉపాధి కల్పనలో భాగంగా కీలక ఒప్పందాలు చేసుకుంటున్నట్లు మంత్రి సవిత తెలిపారు. కో ఆప్టెక్స్, టాటా తనేరియా, బిర్లా ఆద్యం సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామన్నారు. ఆప్కోలో రెడీ మేడ్ దుస్తుల అమ్మకాలతో నేతన్నలకు పెరిగిన ఉపాధి పెరిగిదన్నారు. ఈ కామర్స్ లో ద్వారా చేనేత వస్త్రాలను విక్రయిస్తున్నామన్నారు. విశాఖలో 5 ఎకరాల్లో రూ.172 కోట్లతో యూనిటీ మాల్ నిర్మిస్తున్నామన్నారు. ఎమ్మిగనూరు, రాయదుర్గం, మైలవరం, పామిడిలోనూ టెక్స్ టైల్స్ పార్కులు, మంగళగిరిలో మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు
చేయనున్నామన్నారు. ధర్మవరంలో రూ.30 కోట్లతో మెగా క్లస్టర్ నిర్మిస్తున్నామన్నారు. పిఠాపురంలో మెగా క్లస్టర్ నిర్మాణానికి చర్యలు ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో రూ.10.44 కోట్లతో 10 మినీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో ఏపీ చేనేత రంగం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. జాతీయ స్థాయిలో ప్రకటించిన ఓడీ ఓపీ అవార్డుల్లో రాష్ట్రానికి తొమ్మిది అవార్డులొస్తే, వాటిలో నాలుగు అవార్డులు చేనేత ఉత్పత్తులకే వచ్చాయన్నారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలకు గాను జాతీయ స్థాయిలో ఒక బంగారు పతకం లభించిందన్నారు. నేతన్నలకు గౌరవప్రదమైన జీవనం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు.
*కల్తీకి కేరాఫ్ అడ్రాస్ జగన్*
వెంకన్న ఆస్తుల కొట్టేయన్న కుట్రతో పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని జగన్ కల్తీ చేయించారని మంత్రి సవిత మండిపడ్డారు. తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ స్పష్టంచేసిందన్నారు. పామాయిల్, ఇతర కెమికల్స్ తో తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని, నెయ్యిలేదని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్ స్పష్టం చేసిందన్నారు.
జంతుకొవ్వు లేదు కదా…అని చేసిన తప్పు కప్పిపుచ్చుకోడానికి వైసీపీ బ్యాచ్ బుకాయిస్తోందన్నారు. తిరుపతి లడ్డూ కల్తీ జరగడం వాస్తవమన్నారు. మద్యం కల్తీ చేయడమే కాకుండా చివరికి వెంకన్న ప్రసాదాన్ని సైతం కల్తీ చేశారని మండిపడ్డారు. కల్తీకి కేరాఫ్ అడ్రాస్ జగన్ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో చట్టం తనపని తానుచేసుకుపోతుందని మంత్రి సవిత నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా పాల్గొన్నారు.




