మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో నెలకొన్న సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి
రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధులను తాగునీరు, మందుల వంటి అవసరాలకు వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.




