Home South Zone Telangana ట్రాఫిక్ నిబంధనలే ప్రాణరక్ష- పోలీసుల అవగాహనతో పెరిగిన చైతన్యం.|

ట్రాఫిక్ నిబంధనలే ప్రాణరక్ష- పోలీసుల అవగాహనతో పెరిగిన చైతన్యం.|

0

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (భారత్ ఆవాజ్ ప్రతినిధి) ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమని అల్వాల్ పోలీసులు స్పష్టం చేశారు.
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనాజిగూడలో రోడ్డు ప్రమాదాల భద్రతపై భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా అల్వాల్ ఎస్ హెచ్ ఓ, ప్రశాంత్, లాండ్ అండ్ ఆర్డర్ (L&O) విభాగం సిబ్బంది వాహనదారులకు స్థానిక ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ మరియు రెగ్యులేషన్స్ పై విపులంగా అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం, సీటు బెల్టు పెట్టుకోవడం మితిమీరిన వేగంతో వెళ్లకపోవడం వంటి అంశాలను గురించి వివరించారు.

నిబంధనలను అతిక్రమిస్తే ఎదురయ్యే ప్రమాదాలను సోదాహరణంగా వివరిస్తూ వాహనదారులలో చైతన్యం నింపారు. “మీ భద్రతే మా ప్రాధాన్యత” అనే నినాదంతో సాగిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.
తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడే బాధ్యత కూడా తమపై ఉందని వాహనదారులతో  ఎస్ హెచ్ ఓ  ప్రతిజ్ఞ చేయించారు..

#sidhumaroju

NO COMMENTS

Exit mobile version