Friday, January 30, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshతిరుపతి లడ్డూపై గద్దె రామ్మోహన్ నిరసన |

తిరుపతి లడ్డూపై గద్దె రామ్మోహన్ నిరసన |

దేవుడి శిక్ష నుండి ఎవరూ తప్పించుకోలేరు
తిరుమలలో లడ్డూ కల్తీపై తూర్పు శాసనసభ్యులు గద్దె రామమోహన్

భక్తులంతా కలియుగ దైవంగా భావించే శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేసి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీసిన వారు ఆ దేవుడి శిక్షను తప్పించుకోలేరని విజయవాడ తూర్పు శాసనభ్యులు గద్దె రామమోహన్ పేర్కొన్నారు.
గురువారం ఉదయం 9వ డివిజన్ పటమటలంక పెదరామాలయం శుద్ధి కార్యక్రమము, పూజ అక్కడి నుండి పటమట ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. 9వ డివిజన్ నాయకులు చెన్నుపాటి గాంధీ, కాంతిశ్రీ, యలమంచలి దేవేంద్ర ఆధర్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు.
. ఈ సందర్భంగా *శాసనసభ్యులు గద్దె రామమోహన్ మాట్లాడుతూ* భక్తులంతా సాక్షాత్తూ దేవుడిగా భావించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని వైకాపా నాయకులు పూర్తిగా కల్తీ చేయడం చాలా దురదృష్టకరమని, పాపమని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు నియమించిన సిట్ శ్రీవారి లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని నిర్ధారించిందని చెప్పారు. కల్తీకి పాల్పడినవారు శిక్షార్హులని, వారెవరూ కూడ దేవుడి శిక్ష నుంచి

తప్పించుకోలేరని భావించారు. పూర్తిగా రసాయన పదార్థాలతో నెయ్యిని కల్తీ చేసి, లడ్డూలను తయారు చేసి భక్తులకు ఐదు సంవత్సరాల పాటు పంపిణీ చేసి, కోట్లాది రూపాయలు దోచేసి, వైకాపా నాయకులు ఇపుడు ఎదురుదాడి చేయడం, బుకాయించడం గర్హనీయమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లడ్డూలను, అన్న

భోజనాలను ప్రక్షాళన చేసి మంచిగా, పరిశుభ్రంగా పెట్టడం జరుగుతోందని వివరించారు. భక్తుల మనో భావాలు పెద్దఎత్తున దెబ్బతిన్న దృష్ట్యాను, కల్తీ జరిగిందని సిట్ నిర్థారించిన దృష్ట్యాను దేవాలయాల శుద్ధీకరణ, పూజలు, ర్యాలీలు చేపట్టడం జరిగిందని గద్దె రామమోహన్ తెలిపారు.

*ఎన్టీఆర్ జిల్లా టి.డి.పి. అధ్యక్షురాలు గద్దె అనురాధ* మాట్లాడుతూ శ్రీవారి దేవాలయాన్ని వైకాపా నాయకులు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానో లేక ఒక దేవాలయంగా కాక, ఒక ఆదయ వనరుగా చూశారని, కోట్లాది రూపాయలు దోచేశారని విమర్శించారు. వైకాపా నాయకులు అవినీతి, అక్రమాలు, డబ్బు సంపాదన మీదే దృష్టి పెట్టి, భక్తుల మనోభావాలు

తీవ్రంగా దెబ్బతీశారని చెప్పారు. శ్రీవారి లడ్డూ పూర్తిగా కల్తీ నెయ్యితో తయారైందని, కోట్లాది రూపాయలు చేతులు మారాయని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నిర్ధారించిన దృష్ట్యా వైకాపా నాయకులు అశేష భక్తులకు, దేవుడికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్, ఆయన అనుచరులు తిరుమలలో పాపాలకు, ఘోరాలకు పాల్పడ్డారని, వారికి శిక్షలు పడాలన్నారు. వారి హయాంలో అనేక దేవాలయాల మీద దాడులు జరిగినా జగన్ ఏమీ పట్టించుకోలేదని

గుర్తుచేశారు. మన ధార్మికతను రక్షించుకోవడానికి కూటమి నాయకులందరూ కలిసికట్టుగా పోరాడాలని ప్రజా వ్యతిరేకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వైకాపావారు క్షమాపణ చెప్పేంటంతవరకూ వెనక్కు తగ్గకూడదని అన్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన *యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరశింహరావు మాట్లాడుతూ* నెయ్యి కాని నెయ్యిని పూర్తిగా కెమికల్స్ తో తయారు చేసి లడ్డూల్లో కలిపి భక్తులకు పంచిపెట్టడాన్ని సిట్ నిర్థారించిందని, భక్తుల మనోభావాలు ఘోరంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ హయాంలోనూ, చంద్రబాబుగారి హయాంలోనూ తిరుమలలోని కార్యక్రమాలు ఘనంగాను, గౌరవంగాను, భక్తి పూర్వకంగాను జరిగేవని, వైకాపా పాలనలో అవన్నీ

కల్తీమయపోయాయని, అక్రమాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. తిరుమలలోని అవినీతిలో జగన్ కు కూడా వాటా ఉండే ఉంటుందని, అయనను కూడ సుప్రీంకోర్టు పరిధిలో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క లడ్డ స్కామే కాదు, పరకామణి స్కాము, భోజనాలు రుచిలేకపోవడం, గోవిందరాజస్వామివారి దేవాలయంలో బంగారుపు పూతలో స్కాము… ఇలా అనేక అక్రమాలు వైకాపా హయాంలో జరిగాయన్నారు. అప్పట్లో పనిచేసిన వైవి సుబ్బారెడ్డి,

కరుణాకరరెడ్డి, ధర్మారెడ్డి భక్తులకు క్షమాపణ చెప్పాలని, చేసిన తప్పులకు శిక్ష అనుభవించాలని అన్నారు.
ఈ కార్యక్రములో తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, టి.డి.పి. డివిజన్ పార్టీ అధ్యక్షులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments