పుంగనూరు మండలం, సుగాలి మిట్ట అంగన్వాడి కేంద్రం వద్ద బుధవారం ఒక చిన్నారి ఆడుకుంటూ రోడ్డుపైకి రాగా, మదనపల్లి వెళ్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే చిన్నారిని పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు కోలార్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు విచారణలో తెలియాల్సి ఉంది
# కొత్తూరు మురళి.




