అన్నమయ్య జిల్లాలో టమోటా ధరలు పతనమయ్యాయి. జిల్లా కేంద్రమైన మదనపల్లె టమోటా మార్కెట్కు బుధవారం కేవలం 57 మెట్రిక్ టన్నుల టమోటాలు మాత్రమే చేరాయి.
ఇంత తక్కువ సరుకు రావడం ఇదే తొలిసారి. అయినప్పటికీ, వ్యాపారులు 10 కిలోల మొదటి రకం టమోటాలను రూ. 150కు, రెండో రకం రూ. 140కు, మూడో రకం రూ. 130కే కొనుగోలు చేయడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ధరల పతనం వెనుక కారణాలు తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.




