నరసరావుపేట :- ఓ ప్రేమ జంట తమ కుటుంబ సభ్యుల నుండి రక్షణ కల్పించవలసిందిగా బుధవారం రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువురి తల్లిదండ్రులను స్టేషన్ కి పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఇరువురు మేజర్లు కావడంతో చట్టపరంగా వివాహం చేసుకున్నారని వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందిగా ప్రేమజంట తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు. నరసరావుపేటకు చెందిన దేవర ఉపేంద్ర , వినుకొండ కు చెందిన పాలపాటి పావనీ
లు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. బుధవారం కనపర్తి చర్చిలో వివాహం చేసుకున్నారు. తమ తల్లిదండ్రుల నుండి రక్షణ కల్పించవలసిందిగా పోలీసుల ను ఆశ్రయించడంతో పోలీసులు ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి కథను సుఖాంతం చేశారు.




