Thursday, January 29, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshకందుకూరు–మార్కాపురం పోలీసుల సమీక్ష |

కందుకూరు–మార్కాపురం పోలీసుల సమీక్ష |

ఉమ్మడి జిల్లాలోని కందుకూరు, మార్కాపురం సబ్ డివిజన్ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు

పెండింగ్ కేసులలో దర్యాప్తును వేగవంతం చేసి, కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలి:జిల్లా ఎస్పీ గారు.

ప్రాపర్టీ నేరాలను కట్టడి చేస్తూ రికవరీ శాతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి.

రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు మరింత ప్రత్యేక చర్యలు అమలు చేయాలి.

మహిళల భద్రతకు ప్రాధాన్యత నిచ్చి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించండి

మాదక ద్రవ్యాల అనర్ధాలపై,సైబర్ నేరాలపై విద్యార్థులు, ప్రజల్లో విరివిగా అవగాహన చేయండి

ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల పట్ల చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎస్పీ గారు

ఎన్ఫోర్స్మెంట్‌ను పెంచి చట్టవ్యతిరేక మరియు అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలి.*

ఉమ్మడి ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాలోని మార్కాపురం, కందుకూరు సబ్‌డివిజన్‌లకు చెందిన డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ గారు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ గారు ముఖ్యంగా గ్రేవ్/నాన్‌గ్రేవ్ కేసులు, హత్య కేసులు, ప్రాపర్టీ కేసులు, పోక్సో కేసులు, పెండింగ్‌లో ఉన్న నాన్‌బెయిలబుల్ వారెంట్లు, రోడ్డు ప్రమాదాలు, దేవాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ఆయా సబ్‌డివిజన్‌లలోని సీసీ కెమెరాల పనితీరు, ఎన్ఫోర్స్మెంట్ మరియు ఇతర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.

ఈ సమావేశంలో గ్రేవ్ కేసుల విచారణను వేగవంతం చేసి, శాస్త్రీయ పద్ధతుల్లో ఆధారాలు సేకరించి ముద్దాయిలను అరెస్ట్ చేయాలని, ఆర్ఎఫ్ఎస్ఎల్/ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు త్వరగా తెప్పించి నిర్ణీత సమయంలో కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఎస్పీ గారు సూచించారు. మహిళలపై జరిగే నేరాలు, పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేసి నిర్ణిత గడువులో ఛార్జ్ షీట్ వేయాలని, భాదితులకు న్యాయం అందేవిధంగా చూడాలన్నారు.

ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకుని ప్రాపర్టీ రికవరీ శాతాన్ని పెంచాలని, దొంగతనాలు, దోపిడీల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్, నైట్ బీట్స్ బలోపేతం చేసి క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే నాన్‌బెయిలబుల్ వారెంట్లు (NBW) ఎలాంటి పెండింగ్ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, సంబంధించిన రికార్డ్స్ లను సక్రమంగా నిర్వహించాలన్నారు.

అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాలయాలు/ప్రార్థనా మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, అవి సక్రమంగా పనిచేసే విధంగా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

జిల్లాలో పాతముద్దాయిలపై నిఘా పెట్టాలని, ప్రతి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ పెంచి అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని, నిరంతర వాహన తనిఖీలు చేపట్టాలని, గతంలో కంటే రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు ఇంకా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుని బ్లాక్ స్పాట్స్‌ను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అలాగే రోడ్డు భద్రతా నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.

సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల అనర్థాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, బాల్య వివాహాలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు.

కెమెరాలు/డ్రోన్ ల యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియచేసి ఏర్పాటు చేసే విధంగా చూడాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని పాటిస్తూ పొలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలిగి వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉండాలన్నారు.

బహిరంగ ప్రదేశాలలో గుర్తించి ప్రజల సహకారంతో వాటిని శుభ్రం చేయాలని ఆదేశించారు… బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే… అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు, కందుకూరు డిఎస్పీ సిహెచ్. వి. బాలసుబ్రమణ్యం, ఎస్బి డిఎస్పీ చిరంజీవి, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, సబ్ డివిజన్ సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments