కోండపి పోలీస్ స్టేషన్‌లో సి.ఐ. తనిఖీ: రికార్డుల నిర్వహణ మరియు పెండింగ్ వారెంట్లపై ఆకస్మిక సమీక్ష.
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, కోండపి సీఐ గారు కోండపి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, పోలీస్ స్టేషన్ పనితీరును సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన రికార్డులు, కేసు డైరీలు, పెండింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్స్ (NBWs) ను సీఐ గారు పరిశీలించి, వాటిని తక్షణమే అమలు చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. రికార్డులు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండాలని, కేసుల ఫాలోఅప్‌లో అలసత్వం వహించరాదని స్పష్టంగా ఆదేశించారు.
అనంతరం సీఐ గారు పోలీస్ సిబ్బందితో ముఖాముఖి చర్చ నిర్వహించి, పై అధికారుల ఆదేశాలను సిబ్బందికి స్పష్టంగా తెలియజేశారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, బాధ్యతాయుత వైఖరి, ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్న అంశాలపై మార్గనిర్దేశం చేశారు. నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్, ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ తనిఖీ ద్వారా పోలీస్ స్టేషన్ స్థాయిలో పనితీరు మెరుగుపడేలా చర్యలు తీసుకోవడం, చట్టసంరక్షణను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని సీఐ గారు తెలిపారు.






