అన్నమయ్య జిల్లాలో నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్లో జరిగిన రెవెన్యూ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారిక బిల్లులు లేకుండా వాహనాల అమ్మకాలు జరగరాదని
రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ స్లాట్ బుకింగ్‌పై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం అందించే శాఖలు రెవెన్యూ లక్ష్యాలను అధిగమించేలా పనిచేయాలని ఆయన అధికారులకు సూచించారు.




