నిమ్మనపల్లె మండలం దిన్నిమీద జంగంపల్లిలో చింత చెట్ల నరికివేత విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణపై పోలీసులు బుధవారం 12 మందిపై కేసు నమోదు చేశారు.
నారాయణ, రవిబాబు వర్గీయుల మధ్య జరిగిన ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు, ఒక వర్గం నుంచి ఐదుగురిపై, మరో వర్గం నుంచి ఏడుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.




