Home South Zone Telangana బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కి నోటీసులు ఇవ్వడం శోచనీయం

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కి నోటీసులు ఇవ్వడం శోచనీయం

0
0

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కి నోటీసులు ఇవ్వడం శోచనీయం : MLA మర్రి రాజశేఖర్ రెడ్డి.|

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి నోటీలివ్వడం శోచనీయ

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు రావలసిందిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్  పిలవడం తీవ్ర శోచనీయం. ఇది రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్ట, ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యల పరిష్కారంలో పాలకులు విఫలమై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాక పదేళ్ల తన సుపరిపాలనలో గొప్పగా అభివృద్ధి చేసిన కేసీఆర్ పై చేస్తున్న దుర్మార్గ ప్రచారంలో భాగమే ఈ నోటీసులు.
తెలంగాణ యావత్ ప్రజల గుండె చప్పుడు కేసీఆర్ ను టార్గెట్ చేసి ఎలాంటి సంబంధం లేని కేసులో విచారించాలనే విషయం సమంజసం కాదు..నాలుగు కోట్ల ప్రజల అభిమాన నాయకులు కేసీఆర్ పై చేస్తున్న నిందారోపణలకు ప్రజలే సరైన సమయంలో సమాధానం చెబుతారు.

నోటీసులు,విచారణల పేరుతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు బీఆర్ఎస్ శ్రేణుల పోరాటం ఆగదు. ఎన్ని కుట్రలు, డైవర్షన్లు చేసినా ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలపై తమ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. విచారణ జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుంది. — MLA. మర్రి రాజశేఖర్ రెడ్డి.
#sidhumaroju
ALWAL

NO COMMENTS