మదనపల్లె బీటీ కళాశాలకు చెందిన కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా భవనాలు నిర్మించిన వ్యవహారం బుధవారం వెలుగులోకి వచ్చింది.
ఇటీవల కళాశాల ప్రాంగణాన్ని ఎస్పీ ప్రధాన కార్యాలయానికి అప్పగించిన తర్వాత, పోలీస్ ఉన్నతాధికారులు పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలను తొలగించి భూమిని చదును చేశారు. ప్రహరీ నిర్మాణానికి సర్వే చేపట్టగా సుమారు 45 మీటర్ల మేర భూమి అక్రమ కబ్జాకు గురైనట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.




