మదనపల్లి పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను గురువారం ఆదేశించారు.
ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఎస్పీ ధీరజ్‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని ఎన్క్రోచ్మెంట్లు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించాలని, ప్రత్యామ్నాయ మార్గాలు, వన్‌వే విధానం, నో పార్కింగ్ జోన్లు అమలు చేయాలని సూచించారు. రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని తెలిపారు.




