Friday, January 30, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshపుంగనూరు: క్షుద్ర పూజల కలకలంతో పాఠశాలకు వెళ్ళని విద్యార్థులు.

పుంగనూరు: క్షుద్ర పూజల కలకలంతో పాఠశాలకు వెళ్ళని విద్యార్థులు.

చౌడేపల్లి మండలం, కాగతి గ్రామంలో మౌని అమావాస్య రోజున పాఠశాల ఆవరణంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ పూజలను తొక్కిన ఒకటవ తరగతి విద్యార్థి మృతి చెందాడని

ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటనతో భయపడిన తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపడం నిలిపివేశారు. అయితే, మూఢనమ్మకాలను నమ్మవద్దని, విద్యార్థులను పాఠశాలకు పంపాలని విద్యాశాఖ అధికారులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది# కొత్తూరు మురళి#.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments