Home South Zone Telangana హైదరాబాద్ లో డేంజర్ బెల్స్- గాలిలో పెరుగుతున్న విషం.|

హైదరాబాద్ లో డేంజర్ బెల్స్- గాలిలో పెరుగుతున్న విషం.|

0
1

హైదరాబాద్ :  హైదరాబాద్ వాసుల ప్రాణవాయువుకు పచ్చజెండా ఊగిపోతోంది. భాగ్యనగరంలో గాలి నాణ్యత దారుణంగా పడిపోవడంతో నగరవాసులు గాలి తీసుకోవడానికే భయపడే పరిస్థితి నెలకొంది.
దక్షిణ భారతదేశంలోని ఇతర మెట్రో నగరాలైన బెంగుళూరు, చెన్నై లను అధిగమించి హైదరాబాద్ అత్యంత కలుషిత నగరాల జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తోంది.

ప్రమాదకరస్థాయిలో సికింద్రాబాద్ :
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB) తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం, సికింద్రాబాద్ పరిధిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) అత్యంత ప్రమాదకరంగా 240 కి చేరుకుంది. ఈ స్థాయి కాలుష్యం ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యమైన వివరాలు:
3 నుండి 4 రెట్లు అధికం. గాలిలో ఉండే సూక్ష్మ ధూళి కణాలు, (pm. 2.5. మరియు pm 10) అనుమతించిన స్థాయి కంటే 3 నుండి 4 రెట్లు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

బెంగుళూరు, చెన్నై కంటే అద్వాన్నం :
వాతావరణ పరిస్థితులు, వాహనాల కాలుష్యం కారణంగా, మన నగరం ఇతర మెట్రో నగరాల కంటే ఎక్కువ భారాన్ని మోస్తోంది.

శ్వాసకోశ వ్యాధుల ముప్పు :
గాలిలో కాలుష్య స్థాయి పెరగడంతో చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అధికారుల హెచ్చరిక:
నిర్మాణరంగ కార్యకలాపాలు, విపరీతమైన వాహనాల రద్దీ, మరియు చలికాలంలో ఉండే స్థిరమైన వాతావరణం వల్ల కాలుష్య కణాలు భూమికి దగ్గరగా ఉండిపోతున్నాయి.
తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (TSPCB) ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిఘా పెంచి, కాలుష్య నివారణ చర్యలపై సమీక్షిస్తోంది.

SIDHUMAROJU✍️
Alwal

NO COMMENTS