Saturday, January 31, 2026
spot_img
HomeSouth ZoneTelanganaఅల్వాల్ పోలీసుల నిఘానేత్రం - నేరాల నియంత్రణే లక్ష్యం.|

అల్వాల్ పోలీసుల నిఘానేత్రం – నేరాల నియంత్రణే లక్ష్యం.|

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్, మరియు కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు ముమ్మరంగ సాగుతున్నాయి.
పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, అల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్ పర్యవేక్షణలో, సెక్టార్ ఎస్సై గీత, ఏఎస్ఐ తుల్జారాం, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి, మరియు కానిస్టేబుల్ నరేష్ బృందం శుక్రవారం యాదమ్మ నగర్ కాలనీలో పర్యటించారు.

ఈ సందర్భంగా కాలనీ వాసులతో సమావేశమైన పోలీసులు, పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, ఏదైనా మోసం జరిగితే వెంటనే 1930 నంబర్ కు, లేదా.. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

అంతేకాకుండా ఫోక్సో (POCSO) చట్టం మహిళల భద్రత. ట్రాఫిక్ నిబంధనలు,మరియు మాదకద్రవ్యాల నియంత్రణ (NDPS) చట్టాలపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, ప్రతి కాలనీలో నిఘా వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని పోలీసులు కోరారు.

ఆలయ భద్రత తనిఖీలు :
అనంతరం శివ నగరంలోని శివాలయం ఆలయాన్ని సందర్శించిన  ఎస్హెచ్వో  ప్రశాంత్, సెక్టార్ ఎస్సై గీత, ఆలయ భద్రతా చర్యలను సమీక్షించారు. గుడి ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు తీరును స్వయంగా తనిఖీ చేశారు.
భక్తుల భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు అన్ని నిరంతరం పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ నిర్వాహకులకు సూచనలు చేశారు.
ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు, లేదా.. డయల్-100/112 కి సమాచారం అందించాలని కోరారు.

#sidhumaroju
Alwal

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments