కేంద్ర బడ్జెట్ 2026-27 లో ఏపీకి భారీ పెట్టుబడులు, నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు, కేంద్ర పన్నుల వాటా పెంపు, SASKI పథకం కొనసాగింపు
రాయలసీమ అభివృద్ధి, విశాఖ ఎకనామిక్ జోన్ వంటి కీలక ప్రతిపాదనలను రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రీ-బడ్జెట్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందుంచింది. ఈ ప్రతిపాదనలు నెరవేరితే రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.





