జగ్గయ్యపేట పట్టణంలోని 10వ వార్డు, చిరునగర్‌లో అర్హులైన లబ్ధిదారుల కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి, KDCC బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ గారు మరియు కౌన్సిలర్ కన్నెబోయిన రామలక్ష్మి గారు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నెట్టెం రఘురామ్ గారు లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారిని వ్యక్తిగతంగా కలిశారు. వారి సమస్యలు, అవసరాలు మరియు అభ్యర్థనలను గమనించి, వ్యక్తిగతంగా పెన్షన్ నగదు అందజేశారు. లబ్ధిదారుల సమస్యలపై చూపిన ప్రత్యేక శ్రద్ధ, వారిలో నమ్మకం మరియు సంతృప్తిని పెంపొందించింది.
ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావటంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు, రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు పెన్షన్లను ఒక రోజు ముందుగా పంపిణీ చేయడం జరిగింది.
నెట్టెం రఘురామ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిరునగర్‌లో ఇళ్ల పట్టాలు మంజూరు చేశారని ఈ సందర్భంగా ప్రజలు గుర్తు చేసుకున్నారు
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు నెట్టెం శివరాం గారు మాజీ కౌన్సిల్ కోరుకూటి సైదులు గారు కోరుకూటి బొబ్బిలి గారు తదితరులు పాల్గొన్నారు





