Home South Zone Andhra Pradesh పుంగనూరులో ఆటో బోల్తా – 11 మందికి గాయాలు |

పుంగనూరులో ఆటో బోల్తా – 11 మందికి గాయాలు |

0

శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, శ్రీ బోయకొండ గంగమ్మ దర్శనానికి వచ్చిన తెనాలి వలస కూలీలు, దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో షేర్ ఆటోలో కల్లూరు గ్రామానికి వెళుతుండగా బోయకొండ పాత బస్టాండ్ వద్ద అదుపుతప్పి ఆటో బోల్తా పడింది.

ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 11 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని 108 వాహనాల ద్వారా మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.

NO COMMENTS

Exit mobile version