పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలసిన కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం గరుడసేవను నిర్వహించనున్నారు. ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి శనివారం తెలిపిన వివరాల ప్రకారం.
ఉదయం ప్రత్యేక పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతం అనంతరం సాయంత్రం ఉత్సవమూర్తిని గరుడ వాహనంపై అలంకరించి మాడవీధులలో ఊరేగింపుగా భక్తుల దర్శనార్థం తీసుకువెళ్తారు కార్యక్రమంలో ఏవి శ్రీనివాస్ ఆచార్యులు, ఏవీ లక్ష్మీపతి ఆచార్యులు పాల్గొన్నారు.
