బోయకొండ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లిన భక్తుల ఆటో శుక్రవారం సాయంత్రం కొండపై బోల్తా పడింది. తెనాలి, రేపల్లి, పల్కికోలు.
పెరవలి ప్రాంతాల నుంచి కూలి పనుల కోసం కందూరుకు వచ్చిన 13 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తిరుగు ప్రయాణమవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం మదనపల్లి ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.




