మదనపల్లె జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య అధ్యక్షతన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జాతీయ కుష్ఠ వ్యాధి వ్యతిరేక దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించబడింది. “వివక్షతను అంతంచేద్దాం.
గౌరవాన్ని కాపాడుదాం” అనే నినాదంతో జనవరి 30 నుండి ఫిబ్రవరి 13 వరకు గ్రామ పంచాయతీల్లో స్పర్శ లెప్రసీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కుష్ఠు పరీక్షలు, మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.






