మదనపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున పుంగునూరు రోడ్డులోని వలసపల్లి నవోదయ పాఠశాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
