మదనపల్లె 34వ వార్డు ఇంచార్జ్ బాలమలి శేఖర్, 35వ వార్డు ఇంచార్జ్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేశారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా పేదల వరకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని, పెన్షన్ ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కలుగుతుందని వార్డు ఇంచార్జ్‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వార్డు సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.
మదనపల్లెలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
RELATED ARTICLES




