మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని కొల్తూరు గ్రామంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ సమక్షంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు చెందిన కీలక నేతలు కార్యకర్తలు బిజెపిలో చేరారు.
మూడు చింతలపల్లి మండల మాజీ అధ్యక్షుడు నందాల శ్రీనివాస్, బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చింతల మాణిక్య రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
కొల్తూరు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కొండ నరసింహారావు తన అనుచరులతో కలిసి కాషాయ కండువా కప్పుకున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుండి వెంక గళ్ళ మహేష్, వెంక గళ్ళ బాలయ్య, వెంకగళ్ల అనూష, తదితరులు బిజెపిలో చేరారు.
గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం నేతలు, కె. నర్సింగారావు, కె. అశోక్, కె. సుధాకర్, కె. భూపాల్, జె. బాల నరసింహ, ఏ. అశోక్, ఏ. బిక్షపతి రాజు, జి. జంగాలు, ఎస్. వెంకటస్వామి, జె. రమేష్ సహా, పలువురు కార్యకర్తలు, ఈటెల రాజేందర్ నాయకత్వంపై నమ్మకంతో బిజెపి పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా, ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బిజెపి బలపడుతోందని, ప్రజలు మార్పుని కోరుకుంటున్నారని, ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి బూత్ అధ్యక్షులు, పి. సురేందర్ రెడ్డి, ఎస్. మల్లేష్ యాదవ్, ఏ. ఆనంద్, మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
#sidhumaroju.
Alwal




