కోస్గి పట్టణ ఎస్సై ఆంజనేయులు గారికి ఘన పదవి విరమణ సన్మానం కోస్గి పట్టణ ఎస్సైగా సుదీర్ఘకాలం సేవలందించి పదవి విరమణ చేసిన శ్రీ ఆంజనేయులు గారిని జీకే ఆర్ ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి కోన రాజశేఖర్ గారు శాలువాతో ఘనంగా సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కోన రాజశేఖర్ గారు మాట్లాడుతూ, ప్రజా శాంతి భద్రతల పరిరక్షణలో ఆంజనేయులు గారు అంకితభావంతో, నిజాయితీగా చేసిన సేవలు ప్రశంసనీయమని అన్నారు. కోస్గి పట్టణంలో విధి నిర్వహణలో క్రమశిక్షణతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండి ఆదర్శవంతమైన పోలీస్ అధికారిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. పదవి విరమణ అనంతరం కూడా ఆయన జీవితంలో ఆరోగ్యం.
శాంతి, సుఖసంతోషాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రముఖులు, అభిమానులు పాల్గొని ఆంజనేయులు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.




